Kedar Murder Mistory : నిర్మాత కేదార్ మృతిపై అనుమానాలున్నాయి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

by Muthe.Rajitha |

ఇటీవల టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కేదార్‌(Producer Kedar) దుబాయ్‌లో మృతి చెందడం సంచలనంగా మారింది.

Kedar Murder Mistory : నిర్మాత కేదార్ మృతిపై అనుమానాలున్నాయి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కేదార్‌(Producer Kedar) దుబాయ్‌లో మృతి చెందడం సంచలనంగా మారింది. కేదార్ మృతి వెనుక గల మిస్టరీ(Kedar Murder Mistory) కేటీఆర్(KTR) కే తెలియాలంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి(MLA Yennam Srinivas Reddy) స్పందిస్తూ.. కేదార్ దుబాయ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందటం పలు అనుమానాలకు దారి తీస్తోంది అన్నారు. కేదార్ మర్డర్ మిస్టరీపై కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI)లతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుల ప్రమేయం ఉందని ఇప్పటికే పలుమార్లు బయటికి వచ్చినట్లు గుర్తు చేశారు. సినీ ప్రముఖులు బ్రాండ్‌ అంబాసిడర్‌ పేరుతో విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని, తర్వాత ఆ చీటర్స్‌ చేతిలో స్టార్స్ మోసపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా హవాలా దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు.

Next Story