- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ముగ్గురే డీఈవోలు: హరీశ్ రావు
రాష్ట్రంలో డీఈఓ పోస్టుల ఖాళీలు, పెండింగ్ బిల్లులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే కేవలం ముగ్గురే రెగ్యులర్ డీఈఓలు ఉన్నారని మిగతా 30 చోట్ల పోస్టులు ఖాళీగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డీఈఓ బాధ్యతలు అప్పగించడం వల్ల వారు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం రెగ్యులర్ డీఈఓలను నియమించాలని డిమాండ్ చేశారు. ఇవాళ సిద్ధిపేటలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రాజకీయ కక్షతో మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారని ధ్వజమెత్తారు.
పథకం పేరు మార్చుకోండి:
కావాలంటే పథకం పేరు మార్చుకోవాలి కానీ, బడుల అభివృద్ధిని ఆపొద్దని సూచించారు. కొత్తగా పాఠశాలల్లో ఒక్క గది కూడా కట్టే ప్రయత్నం చేయడం లేదని పాఠశాలల్లో స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి నాలుగు నెలలు, ఈ ఏడాదివి నాలుగు నెలలు పెండింగ్‌లో ఉండటంతో ఆ భారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడుతోందన్నారు. పెండింగ్ బిల్లులు, డీఏల సమస్యలతో పాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తోందని దుయ్యబట్టారు.






