SEC: ఈ స్థానాలకు ఎన్నికలు లేవు.. ఆశావహులకు షాకిచ్చిన ఈసీ

by Prasad Jukanti |

రాష్ట్రంలో పలు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం లేదని సీఈసీ తెలిపింది.

SEC: ఈ స్థానాలకు ఎన్నికలు లేవు.. ఆశావహులకు షాకిచ్చిన ఈసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల సందడి షురూ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 656 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) రాణికుముదిని వెల్లడించారు. అయితే రాష్ట్రమంతటా ఎన్నికల కోలాహలం మొదలైనా కొన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించబోవడం లేదని ఎస్ఈసీ వెల్లడించారు.

కరీంనగర్, ములుగు..
14 ఎంపీటీసీ, 27 గ్రామ పంచాయతీలకు 246 గ్రామ వార్డులు ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయని స్పష్టం చేశారు. కోర్టు కేసుల కారణంగా ఇక్కడ ఎన్నికల నిర్వహణ సాధ్యం కావడం లేదని, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ స్థానాల్లో ఎన్నికలు జరగబోవని తెలిపారు. ములుగు జిల్లాలోని 25 గ్రామ పంచాయతీలు, కరీంనగర్ జిల్లాలోని 2 పంచాయతీలకు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు.

Next Story