- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ ఆగర్భ శత్రువులే, ఇక్కడ మంచి మిత్రులు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
జాతీయ స్థాయిలో ఆగర్భ శత్రువులు, తెలంగాణలో మంచి మిత్రులు అని కాంగ్రెస్, బీజేపీ లను ఉద్దేశించి మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: జాతీయ స్థాయిలో ఆగర్భ శత్రువులు, తెలంగాణలో మంచి మిత్రులు అని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లను ఉద్దేశించి మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ (BRS Party Silver Jublee) సందర్భంగా జిల్లాల పర్యటనలో ఉన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా (Osmania) పై ఉక్కు పాదం మోపుతున్నారని ఆరోపించారు. అలాగే జాబ్ క్యాలెండర్ (Job Calender) లేదు.. కొత్త ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగభృతి రాదు.. అని ఫైర్ అయ్యారు.
అంతేగాక అధికారం కోసం అశోక్ నగర్ (Ashok Nagar) గడపతొక్కారని, అధికారం దక్కిన తర్వాత నిరుద్యోగుల గొంతునొక్కారని సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం నిలదీసిన దళిత రైతు వెంకటయ్యను అరెస్టు చేశారని, దళితరైతు అభిప్రాయం తీసుకున్న జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్ లను జైలుకు పంపించారని, మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ (Rasamayi Balakishan) ఇంటి మీద దాడికి యత్నించారని మండిపడ్డారు. ఇక ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే దాడులు, జైలు.. రాజ్యాంగం పట్టుకుని దేశంలో తిరిగే రాహుల్ గాంధీకి (Rahul Gandhi) తెలంగాణలో జరుగుతున్న అరాచక కాంగ్రెస్ పాలన కనిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీ ఆగర్భ శత్రువులు అని, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు మంచి మిత్రులు అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






