- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాడు ‘గుండు’.. నేడు ‘గారు’: సీఎం రేవంత్‌కు ఎంపీ అర్వింద్ కౌంటర్
మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. తాజాగా, నిజామాబాద్‌లో కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీలను నామినేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేని అన్నారు. కానీ, బాధ్యతను మరిచి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడొద్దని హితవు పలికారు.
మోరీలు సాఫ్ చేయడానికి మోదీ అవసరం లేదని.. ఆయన నిధులు మాత్రమే ఇస్తారని, మోరీలు సాఫ్ చేయించాల్సింది మీరు అంటూ తనదైన స్టైల్లో అర్వింద్ సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను బకాసురుల లెక్క తింటున్నారని ఫైర్ అయ్యారు. స్వయానా మున్సిపల్ శాఖను వెలగబెడుతున్న ముఖ్యమంత్రి పారిశుద్ధ కార్మికులకు కూడా సక్రమంగా జీతాలు కూడా ఇవ్వట్లేదని చురకలంటించారు. ముఖ్యమంత్రి కాక ముందు తనను రేవంత్ రెడ్డి ‘గుండు’ అని సంబోధించే వాడని సీఎం అయ్యాక.. తాను తిడతానని ‘ధర్మపురి అర్వింద్ గారు’ అని పిలుస్తూ మర్యాద గుర్తుకు వచ్చిందని కామెంట్ చేశారు. తాను ఏ ఒక్కటి మరువలేదని అన్ని గుర్తు ఉన్నాయని అన్నారు. ఫిబ్రవరి 13న నాడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని.. ఆ రోజు ఎవరి లాగులో ఎవరు తొండలు ఇడుస్తారో చూద్దామని ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






