- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : వాళ్ళ రాజ్యం నడుస్తోంది : మంత్రి దామోదర గుస్సా
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Raja Narasimha) సొంత పార్టీ నేతలపై సెటైర్లు విసిరారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Raja Narasimha) సొంత పార్టీ నేతలపై సెటైర్లు విసిరారు. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ నేతల రాజ్యమే నడుస్తుందని, తమ మాట చెల్లుబాటు కావడం లేదని గుస్సా అవుతున్నట్టు సమాచారం. ఈ రాష్ట్రంలో హెలీకాప్టర్ ఎక్కాలన్నా వాళ్లే.. వాటిని కొనాలన్న వాళ్లేనని అసహనం వ్యక్తం చేశారు. సొంతంగా తాను ఒక్కసారి కూడా హెలికాప్టర్ ఎక్కలేదని, వాళ్ళు మాత్రం పక్క జిల్లాకు పోవాలన్న అది లేకపోతే కాలు బయట పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ సెక్రటేరియట్ పై మాత్రమే హెలిప్యాడ్ పెట్టాలని అన్నారు . కాగా గత కొంతకాలంగా రాష్ట్ర మంత్రులు, చివరికి కొంతమంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యక్రమాలకు హెలీకాప్టర్ వాడటంపై సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నట్టు సమాచారం.






