- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మినిస్టర్స్ క్వార్టర్స్‌లో దొంగతనం.. చోరీకి గురైన వస్తువులు ఏంటో తెలుసా?
by Ravi |
మంత్రుల నివాస ప్రాంగణంలో దొంగతనం కలకలం రేపుతోంది. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో దుండగులు చోరికి పాల్పడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రుల నివాస ప్రాంగణంలో దొంగతనం కలకలం రేపుతోంది. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో దుండగులు చోరికి పాల్పడ్డారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కట్టడాల్లో నిర్మాణ సామగ్రి చోరీకి గురైంది. కన్స్ట్రక్షన్ సైట్ నుంచి తలుపులు, స్టీల్ సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ క్రమంలోనే ఆర్ అండ్ బీ అధికారి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అత్యంత హై సెక్యూరిటీతో ఉండే మినిస్టర్స్ క్వార్టర్స్‌లోనే దొంగతనం జరగడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. డోర్స్, స్టీల్ వస్తువులు దొంగిలించిన వారి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






