ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-27 04:54:14  IST  )

కడప (Kadapa)లో జరుగుతోన్న మహానాడు (Mahabadu) పండగ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ చీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు.

ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కడప (Kadapa)లో జరుగుతోన్న మహానాడు (Mahabadu) పండగ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ చీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) ఎమోషనల్ ట్వీట్ చేశారు. అందులో ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతమని ప్రస్తావించారు. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి అని.. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యమని అన్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడున్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది తమ సంకల్పమని పేర్కొన్నారు.

అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామని.. తెలుగుదేశం పరీక్షలను ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందని తెలిపారు. గడచిన ఎన్నికల్లో టీడీపీ (TDP) విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహించ తలపెట్టామని తెలిపారు. మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యతనివ్వాలని, ‘అన్నదాతకు అండగా’ నిలవాలని, ‘స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలనే తన సంకల్పమని అన్నారు. ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, ‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి.. అదే నా ఆశ..ఆకాంక్ష అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Next Story