- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD Sadar: దున్నపోతుకి రూ.31 వేల విలువ చేసే మద్యం తాగించిన యువకుడు
హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాన్ని(Hyderabad Sadar Festival) చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాన్ని(Hyderabad Sadar Festival) చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో స్థిరపడిన తెలంగాణ యాదవులంతా కుటుంబసమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. దీపావళి సందర్భంగా సదర్ పండగ నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో యాదవులు తమ దున్నపోతులను ప్రదర్శించడం ఆనవాయితీ. అంతేకాదు.. దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు చేస్తూ.. డ్రాన్స్లు చేయిస్తారు. ఇది సదర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అయితే.. సిటీలోని ముషీరాబాద్‌లో ఈసారి సదర్ వేడుకలు అందరినీ ఆకర్షించాయి. ఈ వేడుకల్లో వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2500 కేజీల బరువు.. 7 అడుగుల వెడల్పు ఉన్న ఈ దున్నపోతును మధు యాదవ్ అనే వ్యక్తి కేరళ నుంచి తీసుకొచ్చాడు. సోమవారం ఈ దున్నను సదర్‌లో ప్రదర్శించాడు. దున్నరాజుకు రూ. 31 వేల విలువజేసే రాయల్ సెల్యూట్ 21 ఇయర్స్ ఫుల్ బాటిల్ తాగించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






