శోకసంద్రంలో సాహితీ లోకం.. రచయిత కొంపల్లి వెంకట్‌గౌడ్ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-25 05:34:40  IST  )

తెలంగాణ సాహితీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

శోకసంద్రంలో సాహితీ లోకం.. రచయిత కొంపల్లి వెంకట్‌గౌడ్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాహితీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రముఖ రచయిత, తెలంగాణ వాది కొంపల్లి వెంకట్ గౌడ్ (Kompally Venkat Goud) ఇవాళ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, రచయిత వెంకట్ గౌడ్ తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) జీవితం, అనుభవాలను ‘వొడువని ముచ్చట’ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన నీటి పారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్ రావు (Vidyasagar Rao) ఆలోచనలను ‘నీళ్ల ముచ్చట’గా పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఇక ప్రముఖ సాహితీవేత్త నోముల సత్యనారాయణ (Nomula Satyanarayana) వంటి ప్రముఖుల జీవితాలను కూడా వెంకట్ గౌడ్ గ్రంథస్తం చేశారు

తన జీవితకాలం ఆద్యంతం తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెంకట్ గౌడ్ పాత్ర అసామాన్యం. రచనల ద్వారా బడుగు బలహీనవర్గాలకు అన్ని విధాలుగా అభ్యున్నతి కలగాలన్న ఆలోచన విధానంతో తన సాహిత్య జీవితాన్ని సాగించారు. గౌడన్నల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvai Papanna) చరిత్రను అక్షరబద్ధం చేసి ఈ తరానికి అందించారు. తెలంగాణ తత్వం, ఉద్యమ స్ఫూర్తిని తన కలంలో నింపుకొని ఎన్నో రచనలు చేసిన ఆయన కృషి చిరస్మరణీయం. ఈ నేపథ్యంలోనే కొంపల్లి వెంకట్ గౌడ్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు సాహితీ ప్రియులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story