- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలిచిన సర్పంచులు నా దృష్టిలో హీరోలే.. బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పోరాడి, గట్టి పోటీ ఇచ్చి గెలిచిన సర్పంచ్‌లు తన దృష్టిలో హీరోలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పోరాడి, గట్టి పోటీ ఇచ్చి గెలిచిన సర్పంచ్‌లు తన దృష్టిలో హీరోలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ కరీంనగర్‌లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను ఆయన ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి గెలిచిన సర్పంచులు అసూయపడేలా బీజేపీ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఆయా గ్రామాల్లో జరిగే అభివృద్ధిని, నిధులను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఎందుకున్నామా..? అని ఆయా పార్టీల సర్పంచులు అనుకునేలా చేస్తానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టిపోటీనిచ్చి గెలిచిన సర్పంచులు నా దృష్టిలో హీరోలేని కొనియాడారు. తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసేందుకు పైసలు లేని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సర్పంచులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉందని బండి సంజయ్ అన్నారు.
బీజేపీ నుంచి గెలిచిన ప్రతి సర్పంచ్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటానని బండి సంజయ్ అరన్నారు. ఎంపీ లాడ్స్, CSR ఫండ్స్‌తో పాటు కేంద్రం నుంచి నిధులు భారీ ఎత్తున తీసుకొచ్చి ఆయా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు సైతం బీజేపీలోకి వస్తే వస్తే ఆయా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని భరోసానిచ్చారు. అయితే, ఈ నెల 18లోపు బీజేపీలో చేరడానికి డెడ్‌లైన్ విధిస్తున్నాను. ఆ తర్వాత వచ్చినా ఎవరినీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. అధికార కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తీవ్ర స్థాయికి చేరక ముందే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలతో పాటు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా గ్రామాల్లో పార్టీ గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పని చేయాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.






