భర్త రుణం తీర్చుకున్న భార్య.. కంటతడి పెట్టిన గ్రామస్తులు

by Disha Web Desk 2 |
భర్త రుణం తీర్చుకున్న భార్య.. కంటతడి పెట్టిన గ్రామస్తులు
X

దిశ, శంకరపట్నం: కట్టుకున్న భార్య ఆ భర్త దహన సంస్కారాలు నిర్వహించి, భర్త రుణం తీర్చుకున్న సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. సోమవారం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన చల్లూరి పోచయ్య మృతి చెందాడు. దీంతో ఆయనకు కూతురు, కుమారులు లేకపోవడంతో భార్య కొమురమ్మే అన్ని తానై హిందూ సంప్రదాయ ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించింది. భార్య కొమురమ్మ భర్తకు నిప్పు పెట్టడాన్ని చూసిన గ్రామస్తులంతా కంటనీరు పెట్టుకున్నారు. పోచయ్య గ్రామపంచాయతిలో కొన్నేళ్లు సపాయి కార్మికుడిగా పనిచేశాడు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. భార్య, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటనీరు తెప్పించాయి. ఈ అంతిమ సంస్కారంలో గ్రామ సర్పంచ్ మోరె అనూష శ్రీనివాస్, ఎంపీటీసీ ఎస్కే మోయిన్, గ్రామపంచాయతీ పాలక సభ్యులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed