- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం..
సీనియర్ సిటిజన్స్ చట్టం అమలులో నిర్లక్ష్యం... - ఉన్నతాధికారుల ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారులు

రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం...
- సీనియర్ సిటిజన్స్ చట్టం అమలులో నిర్లక్ష్యం...
- ఉన్నతాధికారుల ఆదేశాలను తుంగలో తొక్కిన వైనం
దిశ నల్లగొండ బ్యూరో: సీనియర్ సిటిజన్స్ చట్టం అమలు చేయడంలో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల పోషణకు కొడుకులు సహకరించట్లేదని వృద్ధులైన తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ చట్టం అమలు చేసే అధికారులకు ఫిర్యాదు చేస్తే.... అధికారులు ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ప్రవర్తిస్తున్నట్లు సమాచారం..
పూర్తి వివరాల్లోకి వెళితే.... రాజుపేట గ్రామం తిప్పర్తి మండలానికి చెందిన లోకాని కోటయ్య తండ్రి బంగారయ్య తన ఇద్దరు కుమారులు తమ ఆలనా పాలన చూడడం లేదని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత ఆర్డీవో కోర్టులో కూడా పిటిషన్ వేశారు. అయితే కోటయ్య కుమారులైన లోకాని ప్రభాకర్, లోకాని శేఖర్ లు ఇద్దరు తల్లిదండ్రుల పోషణకు అవసరమైన ఏర్పాట్లు చేసే వరకు వాళ్ళ పేర్లతో ఉన్న భూములు క్రయవిక్రయాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులలో ప్రభాకర్ కు సంబంధించిన సర్వే నెంబర్ 418/1లో ఉన్న 1.17 గుంటల భూమిని, లోకాని శేఖర్ కు సంబంధించిన భూమిని కూడా బ్లాక్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.. అయితే లోకాని శేఖర్ కు సంబంధించిన భూమిని బ్లాక్ చేయాలని వచ్చిన ఉత్తర్వులు మేరకు తనకు సంబంధం లేని 108,109 సర్వే నెంబర్లలో ఉన్న 1.17 ఎకరాల భూమిని బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు... కానీ 108,109 సర్వే నెంబర్లకు అందులోని 1.17 లోకానికి శేఖర్ కు ఎలాంటి సంబంధం లేదు.
ఉత్తర్వులలో తప్పుగా నమోదు చేశారని....!!
తల్లిదండ్రుల పోషణకు కావలసిన సహకారం అందించలేదని కారణంగా కుమారుల స్థిరాస్తులు ( భూములను) క్రయవిక్రయాలు జరగకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులలో లోకాని శేఖర్ కు సంబంధించిన భూములు కాకుండా ఇతర వ్యక్తుల భూముల సర్వే నెంబర్లు వేశారని, దాంతో అధికారులు తన పట్ల వివక్ష చూపిస్తున్నారని లోకానికి కోటయ్య పెద్ద కుమారుడు లోకాని ప్రభాకర్ జూలై 31, 2025న అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అయినా జిల్లా ఐసిడిఎస్, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారి ఇద్దరు కూడా స్పందించలేదు. పదేపదే అధికారం కలిసి విషయాన్ని గుర్తు చేసిన చూస్తాం చేస్తామన్నారు తప్ప.... జరిగిన పొరపాట్లను సరిచేయలేదు....
అధికారుల ఇష్టారాజ్యం...
వయోవృద్ధుల సంక్షేమ చట్టం అమలుచేనులో భాగంగా రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వృద్ధాప్యంలో ఉన్న లోకాని కోటయ్య పోషణకు ఎలాంటి సహకారం కుమారులు అందివ్వడం లేదు. అయితే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తండ్రి పోషణకు కుమారులు పట్టించుకోకపోతే వారి స్థిరాస్తులను తండ్రికి చెందేలా చేయాలని సూచించారు. కానీ నల్లగొండ రెవెన్యూ డివిజన్ అధికారి, తిప్పర్తి రెవెన్యూ అధికారి ఇద్దరు కలిసి 2025 సెప్టెంబర్ 11న లోకాని కోటయ్యకు పెద్ద కుమారుడు ప్రభాకర్ కు సంబంధించిన భూమిని సెల్ డీడ్ చేశారు. కానీ చిన్న కుమారుడికి సంబంధించిన ఎలాంటి ఆస్తులను కూడా తండ్రికి రిజిస్ట్రేషన్ చేయకపోవడం అధికారుల పక్షపాత ధోరణి కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ ఆదేశించిన ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులు సొంత నిర్ణయాలు పాటించి అన్యాయం చేయడం దారుణం.
వాళ్లు కుమ్మక్కయ్యారు : లోకాని ప్రభాకర్, రాజు పేట
రెవెన్యూ అధికారులు నా తమ్ముడు లోకాని శేఖర్ తో కుమ్మక్కయ్యారు.ఈ ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు నడిచినట్లు నాకు అనుమానం ఉంది. నా ఆస్తి మా నాన్న సాకు చూపి, రెవెన్యూ అధికారులకు ఆశ పెట్టిన కొల్లగొట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేశా : రామక్రిష్ణ, తహసీల్దార్ తిప్పర్తి..
లోకాని ప్రభాకర్ కు సంబంధించిన భూమిని ఆయన తండ్రి కోటయ్యకు రిజిస్ట్రేషన్ చేశాం. ఇది పూర్తిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేయడం జరిగింది.






