- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వయోవృద్దుల సంక్షేమం, భద్రతే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ, పర్యవేక్షణ బిల్లు, 2026” వయోవృద్ధుల సంక్షేమాన్ని బలోపేతం చేసే కీలక చర్యగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ, పర్యవేక్షణ బిల్లు, 2026” వయోవృద్ధుల సంక్షేమాన్ని బలోపేతం చేసే కీలక చర్యగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు తమ తల్లిదండ్రుల సంరక్షణను బాధ్యతగా తీసుకుని, వారి ఆర్థిక, వైద్య అవసరాల కోసం వేతనం నుంచి కనీసం 15% లేదా రూ.10,000 నేరుగా జమ చేయాలని బిల్లులో నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
ఈ బిల్లును సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి శాఖలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం, ఫిర్యాదులను 60 రోజుల్లో పరిష్కరించడం, నిర్లక్ష్యం చూపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటి కఠిన నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం, కుటుంబ బాధ్యతలను చట్టబద్ధం చేయడం ఈ బిల్లుకు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ బిల్లు ఎంతో ఉపయోగకరమని, జిల్లా స్థాయిలో దీన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. సమావేశంలో వయోవృద్ధుల శాఖ డైరెక్టర్ శైలజ బిల్లుపై వివరణ ఇవ్వగా, ప్రజాప్రతినిధులు, అధికారులు, వయోవృద్ధుల ప్రతినిధులు పాల్గొన్నారు.






