- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

కమనీయం రాములోరి కళ్యాణం
- పర్ణశాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి పెళ్లి వేడుక
- పవిత్ర పునర్వసు నక్షత్రం సందర్భంగా వైభవోపేతంగా నిర్వహణ
దిశ, దుమ్ముగూడెం : పవిత్ర పునర్వసు నక్షత్రం సందర్భంగా బుధవారం పర్ణశాలలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామికి వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవం జరిగింది . గోదావరీ నదీ జలాలను తీర్థ బిందెలో తీసుకొని వచ్చిన అర్చక స్వాములు, పంచామృతములతో స్వామివారికి విశేష అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మాంగల్య ధారణ, కళ్యాణ తలంబ్రాలు వంటి ఘట్టాలు సాంప్రదాయ బద్ధంగా అత్యంత శ్రద్ధతో నిర్వహించారు.ఈ దివ్య కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు, స్వచ్ఛంద సేవకులు హాజరై, స్వామివారి కళ్యాణ అక్షతలను శిరసా ధరించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని స్వీకరించి, భక్తులు స్వామివారికి, అమ్మవారికి కట్నం కానుకలు సమర్పించి తరించారు.ఆలయ ఇన్చార్జి అనిల్ కుమార్ పర్యవేక్షణలో, ప్రధాన అర్చకులైన భార్గవాచార్యులు, అమరవాది కృష్ణమాచార్యులు, శ్రీకాంత్, వెంకటాచార్యులు, నరసింహాచార్యులు, మల్లూరి రవికుమార్ శర్మ ఘనంగా నిర్వహించారు.






