- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
H1-B visas: 24 గంటలు గడవక ముందే మాట మార్చిన ట్రంప్ సర్కార్.. H1-B వీసాలపై ఈ యూటర్న్ ఎందుకు?
హెచ్-1 బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గడం చర్చనీయాశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికా (America) ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో మళ్లీ ఎప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో తెలియక యావత్ ప్రపంచం సతమతం అవుతోంది. నిన్నా మొన్నటి వరకు సుంకాల పేరుతో ప్రపంచ మార్కెట్లను హడలెత్తించిన ట్రంప్.. తాజాగా హెచ్-1 బీ వీసా పేరుతో పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1 బీ వీసాల (H-1B visa) వార్షిక దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ. 88 లక్షలు)కు పెంచుతూ సంబంధిత ఉత్తర్వులపై ట్రంప్ శుక్రవారం సాయంత్రం(అమెరికా కాలమానం ప్రకారం) సంతకం చేశారు. ఈ పరిణామం అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులతో సహా ప్రపంచంలోని వివిధ దేశాల వారికి బిగ్ షాక్ గా మారింది. అయితే హెచ్-1 బీ వీసాల విషయంలో నిర్ణయం తీసుకుని 24 గంటలు గడవక ముందే ట్రంప్ సర్కార్ మాట మార్చింది. తాజాగా పలు సడలింపులు ఇస్తున్నట్లు వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Carolyn Leavitt) చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
ఎందుకీ యూటర్న్?
హెచ్-1బీ వీసా విషయంలో ట్రంప్ సర్కార్ నిర్ణయం టెక్ కంపెనీలతో పాటు వివిధ దేశాలకు చెందిన ఉద్యోగులను తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. ప్రస్తుతం అమెరికా బయట ఉన్నవారు లక్ష డాలర్లు చెల్లించకపోతే వారి హెచ్-1బీ వీసా పిటిషన్లను 12 నెలల వరకు పరిశీలిచబోమని తొలుత ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో యూఎస్ లోని దిగ్గజ కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఇత దేశాల్లో ఉన్న హెచ్-1 బీ వీసా దారులను తక్షణమే అమెరికాకు తిరిగి రావాలని వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను ఆదేశిస్తూ మెయిల్స్ పంపించాయి. ఈ క్రమంలో ఇటు కంపెనీలు, అటు ఉద్యోగుల మధ్య తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ట్రంప్ సర్కార్ మాట మార్చింది. హెచ్-1 బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల ఫీజు ఏడాదికి కాదని, ఇన్ వన్ టైమ్ పేమెంట్ అని తాజాగా స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే ఈ తరహా వీసా ఉండి అమెరికా బయట ఉన్నవారు ఫీజు విషయంలో ఆందోళన చెందవద్దని ఎప్పటిలాగే తిరిగి అమెరికాకు తిరిగి రావొచ్చని క్లారిటీ ఇచ్చింది. కేవలం కొత్తగా హెచ్-1 బీ వీసా కోసం అప్లయి చేసుకునే వారికి, రెన్యూవల్స్ కు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. అయితే అమెరికాలోకి ప్రవేశించే హెచ్-1బీ వీసాదార్లంతా లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్న ట్రంప్ ప్రభుత్వం ఆ వెంటనే ఇదంతా తూచ్.. కేవలం కొత్త వీసా దారులకేనని మాటమార్చడంతో ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక రీజన్ ఏంటి అనే చర్చ మొదలైంది. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాకే నష్టం జరగబోతోందని, అలాగే ఈ నిర్ణయం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక ఈ నిర్ణయంతో టెక్ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను ఇతర దేశాలకు తరలించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆయా కంపెనీల కార్యాకలాపాలు ప్రాముఖ్యత ఇతర దేశాల్లో పెరిగే అవకాశం ఉటుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్లు చర్చ జరుగుతోంది.
ట్రంప్ మంకు పట్టు:
రెండో దఫా అధికారంలోకి వచ్చాక ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ట్రంప్ కు కోర్టుల్లో వరుస షాకులు, ఆదేశంలోని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలను అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. అంతకు ముందు ట్రంప్ జారీ చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్.. జన్మతః పౌరసత్వం హక్కు రద్దు ఆర్డర్ ను సైతం ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా తీసుకున్న హెచ్-1 బీ వీసా విషయంలోనూ న్యాయపరమైన చిక్కులు తప్పవనే చర్చ జరుగుతోంది. హెచ్-1 బీ వీసా విషయంలోనూ ట్రంప్ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఇది నిర్లక్ష్యపూరిత ప్రయత్నం అని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి విమర్శించగా, వార్షిక ఫీజు పెంపుతో అమెరికాయే ఉక్కిరిబిక్కిరి కానుందని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం తిరిగి భారత్ కు లాభం చేకూర్చుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచస్థాయి ప్రతిభావంతుల ఎంట్రీకి ఆంక్షలు విధించడంతో వారంతా భారత్ వైపు చూస్తారనే చెప్పుకొచ్చారు.






