- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా
ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది. జూలై 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని.. ఆ వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేదు కాబట్టి సెలవులు అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర కోర్టును కోరారు.
Read More..






