కో లివింగ్ హాస్టల్స్ విష సంస్కృతిని వెంటనే రద్దు చేయాలి

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ మహానగరంలో కో లివింగ్ హాస్టల్స్ (యువతి యువకులు కలిసి ఉండే హాస్టల్స్ ) విష సంస్కృతి పెరిగిపోతుందని, అదే విధంగా గన్ కల్చర్..

కో లివింగ్ హాస్టల్స్ విష సంస్కృతిని వెంటనే రద్దు చేయాలి
X
  • డీజీపీకి ఫిర్యాదు చేసిన ఓయూ జేఏసీ నాయకుల రాజు నేత

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మహానగరంలో కో లివింగ్ హాస్టల్స్ (యువతి యువకులు కలిసి ఉండే హాస్టల్స్ ) విష సంస్కృతి పెరిగిపోతుందని, ఆదే విధంగా గన్ కల్చర్ పెరుగుతుందని తెలంగాణ ఉద్యమకారులు ఓయూ జేఏసీ నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు రాజు నేత తెలిపారు. డీజీపీ కార్యాయంలో డీజీపీ జితేందర్ ను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్, బిజెపి రాష్ట్ర నాయకులు రాజు నేత మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను, ఐటి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని కో - లివింగ్ హాస్టల్స్ పేరిట విద్యార్థి, యువత జీవితాలు నాశనం చేస్తున్నారని తెలిపారు. కో- లివింగ్ హాస్టల్స్ లో మాదకద్రవ్యాలు (గంజాయి, డ్రగ్స్) వాడకం పెరిగిపోతుంది, తద్వారా యువతీ యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు. పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న అక్రమ హాస్టల్స్ మీద తక్షణమే ప్రత్యేక బృందాల చేత తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డీజీపీ కోరారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజమాన్యాల మీద తగు చర్యలతో పాటు కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమ మారణాయుధాల రవాణా మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ మలిదశ తెలంగాణ ఉద్యమకారులు చెరుకు మణికంఠ, ఏకుల జగన్, ఇమ్మడి మహేష్, గద్దె మహేష్, సత్తూరి శ్రీశైలం, గోవింద్ సురేష్ వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు.

Next Story