- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో BRS సభ.. ముహూర్తం ఖరారు.. ఈసారి గెస్ట్ కేసీఆర్ కాదట!
బీఆర్ఎస్(BRS ) పార్టీ రజతోత్సవ సభను అమెరికా(America)లోని డల్లాస్‌లో నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా డేట్‌ను ఫైనల్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS ) పార్టీ రజతోత్సవ సభను అమెరికా(America)లోని డల్లాస్‌లో నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా డేట్‌ను ఫైనల్ చేశారు. వచ్చే జూన్ 1వ తేదీన డల్లాస్ నగరంలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) హాజరై ప్రసంగించబోతున్నారు. ఈ విషయాన్ని ఎన్ఆర్‌ఐ బీఆర్ఎస్ నేత మహేష్ బిగాల(Mahesh Bigala) స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు మొత్తం అమెరికా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కేటీఆర్ కూతురు, కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. వారిని చూసేందుకు కేసీఆర్(KCR), ఆయన సతీమణి శోభ రెడీ అవ్వగా, మే 22వ తేదీ తర్వాత కేటీఆర్, ఈనెల 16వ తేదీ నుంచి కవిత కూడా అమెరికా పర్యటనలకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కోర్టు అనుమతులు కూడా జారీ చేసింది.
డల్లాస్ నగరంలో జూన్ 1న అట్టహాసంగా బీఆర్ఎస్ రజతోత్సవం నిర్వహిస్తున్నారని మహేష్ బిగాల తెలిపారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరవుతారని చెప్పారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు మళ్లీ పదేళ్ల కిందటి ఇబ్బందులు పడుతున్నారని మహేష్ బిగాల అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.






