మూడోరోజు మేడారం హుండీల లెక్కింపు పూర్తి.. ఆదాయం ఎంతంటే?

by Ajay Maddhiboyina |

మూడోరోజు మేడారం హుండీల లెక్కింపు పూర్తైంది. మూడోరోజు 140 హుండీల‌ను లెక్కించగా 2,01,92,723 రూపాయల ఆదాయం వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం రూ.8,06,46,359 ఆదాయం వ‌చ్చింది.

మూడోరోజు మేడారం హుండీల లెక్కింపు పూర్తి.. ఆదాయం ఎంతంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: మూడోరోజు మేడారం హుండీల లెక్కింపు పూర్తైంది. మూడోరోజు 140 హుండీల‌ను లెక్కించగా 2,01,92,723 రూపాయల ఆదాయం వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం రూ.8,06,46,359 ఆదాయం వ‌చ్చింది. వ‌చ్చిన ఆదాయాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నాలుగు రోజుల‌పాటు మేడారం మహాజాత‌ర సాగిన సంగ‌తి తెలిసిందే. జనవరి 28న ప్రారంభమై జనవరి 31 వరకు జాతర సాగగా కోట్లలో ప్రజలు జాతరకు వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ముందే అంచనా వేసిన ప్రభుత్వం 28 ప్రత్యేక రైళ్లు, వేలాది బస్సులను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో జాత‌ర క‌న్నుల పండుగ‌గా సాగింది. చిన్న చిన్న స‌మస్య‌లు వ‌చ్చినా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా జాత‌ర‌ను నిర్వ‌హించారు.

Next Story