- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే 21, 22న టీజీ డీఈఈసెట్-2026 పరీక్షలు..
రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DED), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ డీసెట్-2026 షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DED), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ డీసెట్-2026 షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026-28 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గానూ కంప్యూటర్ ఆధారిత పరీక్షా పద్ధతిలో మే 21, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్, దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలను ఫిబ్రవరి చివరి వారంలో ప్రకటించనున్నట్లు డీఈఈసెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీ, నాన్-మైనారిటీ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.
డీసెట్ కన్వీనర్‌గా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ నియామకం..
రాష్ట్రంలో 2026-28 విద్యా సంవత్సరానికి గాను రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్-2026 కన్వీనర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డీఈఈసెట్ చైర్‌పర్సన్ నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రమేష్‌ను డీఈఈసెట్-2026 కన్వీనర్‌గా నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.






