- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 6న ముగియనున్న వరంగల్, ఖమ్మం పాలకవర్గాల గడువు
రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ఈనెల 6వ తేదిన ముగియనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ఈనెల 6వ తేదిన ముగియనుంది. దీంతో పాలకవర్గం గడువు ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్ విధించనున్నారు. ఇప్పటికే ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే 130 పట్టణ స్తానిక సంస్థలు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరకల్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
10యూఎల్బీలకు ఒకేసారి..
రాష్ట్రంలోని 10 పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఒకే సారి ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన సీఎంసీ, ఎంఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట్ మున్సిపాలిటీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఇప్పటికే వార్డుల పునర్విభజన కూడా ఫైనల్ చేసిన విషయం విధితమే. జనగణన తర్వాత ఎంటీపీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.






