- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీతాల పెంపు పట్ల ట్రెసా హర్షం
రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలలో పని చేస్తున్న 708 మంది ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (భూ భారతి ఆపరేటర్లు)కు జీతాలను రూ.22,084 లకు పెంపు నిర్ణయం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలలో పని చేస్తున్న 708 మంది ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (భూ భారతి ఆపరేటర్లు)కు జీతాలను రూ.22,084 లకు పెంపు నిర్ణయం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. మధ్యవర్తులను తొలగించి జీతాలను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా అందజేయాలని నిర్ణయించడం పట్ల ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్ లు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఇబ్బందులను తొలగించడంతో పాటు వారి ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ తదితర అంశాల విషయంలో భద్రత కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎల్ఏ లోకేష్ కుమార్ లకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా రెవెన్యూ కార్యాలయాల్లో పని చేస్తున్న మీసేవ ఆపరేటర్లు, అవుట్ సోర్సింగ్ ఆపరేటర్ల విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలని, వారికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని ట్రెసా ప్రభుత్వానికి మరోసారి కోరింది.






