- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఎమ్మెల్యేపై అసెంబ్లీ స్పీకర్చర్యలు తీసుకోవాలి.. తెలంగాణ ఐపీఎస్ఆఫీసర్స్అసోసియేషన్
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్అరెస్టు నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్ప్రతిష్టను దెబ్బ తీసేలా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్అరెస్టు నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్ప్రతిష్టను దెబ్బ తీసేలా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన అసోసియేషన్జాయింట్సెక్రటరీ డీఐజీ (ఉమెన్‌సేఫ్టీ) సుమతి పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బ తీసేలా మాట్లాడిన రఘునందన్‌రావుపై అసెంబ్లీ స్పీకర్క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక శాసనసభ్యుడై ఉండి రఘునందన్‌రావు అభ్యంతరకరమైన భాషలో సీనియర్ఐపీఎస్అధికారి అయిన అంజనీకుమార్‌పై వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ఇలాంటి పరిణామాలు మొత్తం పోలీసు సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తాయని వ్యాఖ్యానించారు. ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు.






