- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి.. తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి డిమాండ్
by Javid Pasha |
ఇంటర్మీడియట్ విద్యలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్ విద్యలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులైన ప్రిన్సిపాళ్లు, జూనియర్ అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బందికి ఐదేండ్లుగా సాధారణ బదిలీలు లేకపోవడం వలన ఉద్యోగులు తీవ్ర మానసిక, ఆర్థిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






