- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు

దిశ,సంగారెడ్డి అర్బన్: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ,మాజీ ఎంపీ బీబీ పాటిల్ తోకలిసి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే నడుస్తోందని అన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో కేంద్రం నిధులు ఉన్నాయని, నిమ్స్ లాంటి పెద్ద ప్రాజెక్టును కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని అన్నారు. పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నా ఎక్కువగా యూరియాను తెలంగాణకు కేటాయిస్తుందన్నారని, తెలంగాణ రాష్ట్ర అవసరాలకు మించి ఏడు శాతం ఎక్కువగా వరి ధాన్యాన్ని పండించిన కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి అండగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళా బిల్లు రావడం కాంగ్రెస్ కు ఇష్టంలేదు...
మహిళా బిల్లులు రావడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. వారు ప్రవేశపెట్టిన బిల్లు అమలు చేస్తే మహిళలకు అన్యాయం జరుగుతుందని, దానికి సవరణలు చేయాలని బిజెపి ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడితే కావాలని మహిళా బిల్లును అడ్డుకొని దేశంలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు.
దేశంలో డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారీ దక్షిణాదికి అన్యాయం చేసింది కాంగ్రెస్..
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జరిగిన ప్రతి డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ డీలిమిటేషన్ చేసినప్పుడు ఉత్తరభారతానికి ఏడు సీట్లు పెంచి దక్షిణాదికి ఒకటి పెంచారని, రెండవసారి డీలిమిటేషన్ చేసినప్పుడు ఉత్తరానికి 29 సీట్లు దక్షిణానికి రెండు చేశారని, ఇందిరాగాంధీ హయాంలో ఉత్తరాదికి 17 దక్షిణానికి మూడు పెంచారని దీన్ని చూస్తే దక్షిణాదికి ఎవరు అన్యాయం చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. ఈనెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి రాబోతున్నారని పరేడ్ గ్రౌండ్లో జరిగే సభకు సంగారెడ్డి జిల్లా నుంచి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, పందుల నాగరాజు ,కసిని వాసు, దోమల విజయ్, ద్వారకా రవి ,డాక్టర్ రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






