- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: కొనసాగుతున్న కేబినెట్ సమావేశం.. ఆర్టీసీ సమ్మె సహా కీలక అంశాలపై హాట్ డిస్కషన్!
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ఆర్టీసీ సమ్మె, కాళేశ్వంపై హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిణామాలతో పాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం హాట్ హాట్‍గా డిస్కషన్ కొనసాగిస్తోంది. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు, ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వంలో విలీనం అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుతో పాటు నీటిపారుదల ప్రాజెక్టుల అంశాలు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిట్ మెంట్, పెండింగ్ డీఏలు, యాసంగి ధాన్యం, మొక్కజొన్నల సేకరణపై కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Next Story






