- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల కళాకారుడి ప్రతిభ.. బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం (వీడియో)
బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు.

దిశ, జగిత్యాల ప్రతినిధి: బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్. ఈనెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా ఈ కళాఖండం తయారీకి తాను సంకల్పించినట్లుగా ఆయన తెలిపారు. 60 గంటలకు పైగా శ్రమించి 16వేల పైగా బియ్యపు గింజలతో మందిర నిర్మాణం తయారు చేసానని త్వరలోనే ఈ మందిరాన్ని ప్రధాని మోడీకి అందజేస్తానని దయాకర్ తెలిపారు. బియ్యపు గింజలతో ఇలాంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ తయారు చేయలేదని అటువంటి రామ మందిర నిర్మాణ కళాఖండం తయారు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని దయాకర్ అన్నారు. బియ్యపు గింజలతో అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసిన డాక్టర్ దయాకర్‌ను పలువురు అభినందించారు. అయితే దయాకర్ గతంలో కూడా అనేక సూక్ష్మ రూప కళాఖండాలను తయారుచేసి పలు అవార్డులతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు.






