- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: ముదిరాజ్‌లకు టీ-కాంగ్రెస్ సంచలన హామీ
తెలంగాణలోని ముదిరాజ్‌లకు టీ-కాంగ్రెస్ సంచలన హామీ ఇచ్చింది. శుక్రవారం కామారెడ్డిలో టీ-కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా బీసీలకు కాంగ్రెస్ కీలక హామీలు

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ముదిరాజ్‌లకు టీ-కాంగ్రెస్ సంచలన హామీ ఇచ్చింది. శుక్రవారం కామారెడ్డిలో టీ-కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా బీసీలపై కాంగ్రెస్ హామీలు వర్షం కురిపించింది. తెలంగాణలో ప్రస్తుతం బీసీ-డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఏ లోకి చేరుస్తామని కాంగ్రెస్ సంచలన హామీ ఇచ్చింది. బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 లక్షల లోన్, బీసీ సబ్ ప్లాన్, ప్రతి జిల్లాలో బీసీ భవన్, ప్రతి మండలంలో ఓ బీసీ గురుకులం, ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి లక్ష కోట్ల ఖర్చు, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంపు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 23 నుండి 42కు పెంపు వంటి పలు కీలక హామీలను బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
Next Story






