- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Municipal Election Results: అక్షరాల ‘సీ-ప్యాక్’ నిజమైన సర్వే
తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సీ-ప్యాక్ సంస్థ వెల్లడించిన సర్వే రిపోర్ట్ అక్షరాల నిజమైంది. నాలుగు నెలల గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఏయే పార్టీ ఎన్నేసి మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాయన్న అంశాన్ని ముందుగానే అంచనా వేయడంలో సక్సెస్ అయ్యింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సీ-ప్యాక్ సంస్థ వెల్లడించిన సర్వే రిపోర్ట్ అక్షరాల నిజమైంది. నాలుగు నెలల గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఏయే పార్టీ ఎన్నేసి మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాయన్న అంశాన్ని ముందుగానే అంచనా వేయడంలో సక్సెస్ అయ్యింది. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ముందే స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలు దాదాపు 95 శాతం నిజం కావడం విశేషం. కార్పొరేషన్లలో కొత్తగూడెం సీపీఐ వశం అవుతుందని 15 రోజుల ముందుగానే సోషల్ మీడియా ద్వారా జనం ముందు ఉంచారు. దాన్ని అందరూ విమర్శించారు. వామపక్ష పార్టీకి అంత సీన్ లేదన్న విమర్శలు వినిపించాయి. కానీ తాజా ఫలితాలు సీ-ప్యాక్ సంస్థ రిపోర్ట్ నిజమని స్పష్టమైంది. ఈ సందర్భంగా సీ-ప్యాక్ ఎండీ సర్వే కిరణ్మాట్లాడుతూ.. తాము అనుభవంతో చేసిన సర్వేగా అభివర్ణించారు. తాము రిలీజ్ చేసిన రిపోర్ట్‌ని కొందరు విమర్శించారన్నారు.
కానీ రిజల్ట్ తమ సత్తా ఏమిటో చెప్తామని అన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 74కి పైగానే వస్తాయన్నామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనే బీఆర్ఎస్ చతికిలపడిన విషయాన్ని గుర్తు చేసినట్లు చెప్పారు. సరిగ్గా తాము విడుదల చేసిన ప్రకారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు వచ్చాయన్నారు. హంగ్‌గా కనిపిస్తోన్న 28 మున్సిపాలిటీలు కూడా తాము చెప్పినట్లుగా ఫలితాలు ఉండనున్నాయని జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లల్లోనూ సీ-ప్యాక్ ద్వారా ఫలితాలను అంచనా వేయనున్నట్లు తెలిపారు. సీ-ప్యాక్ సంస్థ సేవలను మరింతగా విస్తరించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి జనం ఏం ఆశిస్తున్నారో కూడా తమ సర్వే ద్వారా వెల్లడించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల నాడిని ముందుగానే పసి గట్టేందుకు తమ టీమ్‌ని మరింతగా పటిష్టం చేస్తామన్నారు. ఇప్పుడున్న స్టాఫ్‌ని రెట్టింపు చేయనున్నామన్నారు.






