ఆ పరీక్ష వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్.. ఎందుకంటే?

by Disha Web Desk 9 |
ఆ పరీక్ష వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ - 2023 పరీక్ష వాయిదా వేయాలంటూ పలువురు విద్యార్థుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మే 7న 499 నగరాలు/పట్టణాల్లో ఈ పరీక్ష జరగనుండగా దాదాపు 21లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశంలో కరోనా కేసుల పెరుగుదల, బోర్డు పరీక్షలు ఇటీవలే పూర్తికావడంతో ప్రిపరేషన్‌కు తగిన సమయం లేకపోవడం వంటి కారణాలతో ఈ పరీక్షను నెల లేదా రెండు నెలల పాటు వాయిదా వేయాలంటూ విద్యార్థులు జాతీయ పరీక్షల మండలిను కోరుతున్నారు.

ఈ తరుణంలో పీఎంవో, ప్రధాని మోడీ, ఎన్‌టీఏ డీజీ, కేంద్ర విద్యా, వైద్యశాఖ మంత్రులు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తదితరులను ట్యాగ్‌ చేస్తూ పరీక్ష వాయిదా వేయాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నామని ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలంటూ మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.


Next Story

Most Viewed