- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మౌళిక వసతులు బావుంటేనే రాష్ట్ర అభివృద్ధి.. మంత్రి కోమటిరెడ్డి హితవు
మౌళిక వసతులు బావుంటేనే రాష్ట్ర అభివృద్ధి బాట పడుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అటవీ అనుమతులు లేక పెండింగ్ లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని నూతనంగా నియమితులైన ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మౌళిక వసతులు బావుంటేనే రాష్ట్ర అభివృద్ధి బాట పడుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అటవీ అనుమతులు లేక పెండింగ్ లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని నూతనంగా నియమితులైన ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ రహదారుల పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే మరిన్ని నిధులు ప్రభుత్వం నుండి సాధించవచ్చని అధికారులకు తేల్చిచెప్పారు. రహదారులు, భవనాల శాఖకు ప్రజలతో ప్రత్యేక్ష సంబంధం ఉంటుందని రోడ్లు బాగ లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని, అందుకే మీరంత కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.
ఐదుగురు సీఈలకు ఆర్ అండ్‌బీ శాఖలోని వివిధ విభాగాలకు బాధ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీ.ఓ.ఆర్టీ నెంబర్ 40 ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఎస్. తిరుమల అడ్మినిస్ట్రేషన్, టీ జయభారతి సీఈ గా, టీ. రాజేశ్వర్ రెడ్డి రైల్వే సేఫ్టీ వర్క్స్, సిఆర్ఐఎఫ్, జి. చిన్న పుల్లదాసు కి మెంబర్ ఆఫ్ కమీషనరేట్ ఆఫ్ టెండర్స్, డి. శ్యామ్ కుమార్, రూరల్ రోడ్స్, ఎస్సీ ఎస్డీఎఫ్, ఎస్టీ ఎస్డీఎఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్ అండ్ బీ శాఖలో ఐదుగురు సీఈ లకు వారి విభాగాలను కేటాయిస్తూ జీ.ఓ. విడుదలైన నేపథ్యంలో ఐదుగురు చీఫ్ ఇంజనీర్ల (సీఈ)తో మంత్రి కోమటి రెడ్డి తన నివాసంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్‌బీ శాఖలోని ప్రతీ విభాగం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని మీరంతా కష్టపడి పనిచేసి ప్రజలకు మెరుగైన మౌళిక వసతుల కల్పనలో చురుకైన పాత్ర పోషించాలని ఆయన సీఈ లకు దిశానిర్ధేశం చేశారు.
ప్రత్యేకించి హైదరాబాద్ లోని మూడు టిమ్స్, నిమ్స్, వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని బిల్డింగ్స్ సీఈ రాజేశ్వర్ రెడ్డికి సూచించారు. అలాగే ముఖ్యంగా ఆదివాసీ గిరిజనుల జీవితాలు బాగుపడాలంటే తీవ్రవాద ప్రభావితప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వేగం పుంజుకోవాల్సి ఉందని, ఇందుకు చర్యలు తీసుకోవాలని సీఈ టీ జయభారతి కి తెలిపారు. రూరల్ రోడ్స్, ఎస్సీ ఎస్డీఎఫ్, ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించే రోడ్లు గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తాయని ఈ రోడ్లు విషయంలో గత పదేండ్లు నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో వెంటనే సంబంధిత రోడ్లను గుర్తించడం, వాటి నిర్మాణానికి కావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఈ డి. శ్యామ్ కుమార్ ను మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా అడ్మిన్ సీఈ గా ఎస్. తిరుమల, మెంబర్ ఆఫ్ కమీషనరేట్ ఆఫ్ టెండర్స్ సీఈ జి. చిన్న పుల్లదాసు లు మరింత కష్టపడి పనిచేసి రోడ్లు భవనాల శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆదేశించారు. అంతేకాకుండా బాధ్యతలు స్వీకరించిన ప్రతీ సీఈ తమకు కేటాయించిన విభాగంలో సంపూర్ణంగా అధ్యయనం చేసి సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు.






