- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బాస్ అభిమానులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 7 నుంచి 9వ సీజన్ ప్రారంభం
బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షో (Bigg Boss reality show) అన్ని సీజన్లు భారీ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా తెలుగులో హీరో నాగార్జున (Hero Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ని సీజన్లు భారీ హిట్ సాధించాయి. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లను పూర్తి చేసుకొని 9వ సీజన్‌లోకి అడుగుపెడుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా.. తాజాగా సీజన్ 9 ప్రారంభానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అందులో టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన వెన్నెల కిషోర్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్‌గా వెళ్తున్నట్లు కన్ఫామ్ చేశారు.
అలాగే ఈ బిగ్ బాస్ 9 (Bigg Boss 9) సీజన్ " ఈ సారి డబుల్ హౌస్.. డబుల్ డోస్" మోటో తో ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 7వ (September 7th)తేదీ నుంచి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే గత సీజన్ లో కొంత మందిని మాత్రమే సామాన్యులను కంటెస్టెంట్లుగా తీసుకొగా ఈ సారి మరింత మందిని బిగ్ హౌస్ లోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన వారితో అగ్ని పరీక్ష (Agnipariksha) పేరుతో.. సామాన్యులను ఎంపిక చేసే పనులు మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బిగ్ బాస్.. కొత్త సీజన్ తేదీని విడుదల చేయడంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.






