- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kite and Sweet Festival : ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు రంగం సిద్ధం
ఏటా సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్(International Kite and Sweet Festival) నిర్వహణకు రంగం సిద్ధమైంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏటా సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్(International Kite and Sweet Festival) నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్(Secunderabad Parade Ground)లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్.. 21 దేశాల నుంచి వస్తున్నారు. వీరంతా తమ తమ దేశాలకు సంబంధించిన గాలి పటాల్ని ఎగరేస్తారు.
మన దేశంలోని 16 రాష్ట్రాల నుంచి 60 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా వస్తున్నారు. రకరకాల రంగులు, రకరకాల ఆకారాల్లో, కార్టున్ బొమ్మలతో కూడిన భారీ పతంగులు గాలిలో ఎగురుతూ ఉంటే.. ఆ దృశ్యాన్ని చూసి తీరాల్సిందే. రంగురంగుల కైట్ ల ఎగరవేతతో పరేడ్ గ్రౌండ్ రంగుల హరివిల్లు కానుంది. ఈ సంవత్సరం ఈ కైట్ ఫెస్టివల్ కు 3 రోజుల్లో 15 లక్షల మంది దాకా వస్తారనే అంచనా ఉంది. పరేడ్ గ్రౌండ్ లో ఎగిరే కైట్ లు మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి సైతం కనువిందు చేయనున్నాయి.
ఈ సంవత్సరం కైట్ ఫెస్టివల్ లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఫెస్టివల్ రాత్రివేళ రిమోట్ కైట్లను ఎగరెయ్యబోతున్నారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల సమయంలో రిమోట్ కైట్లు గాలిలో ఎగురుతాయి. వీటికి తోకలుండవు. ఇవి చీకట్లో మెరుస్తూ, లైటింగ్‌తో ఎగురుతాయి. వీటిని రిమోట్లతో ఆపరేట్ చేస్తారు. ఇవి చాలా విచిత్రంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అందువల్ల రిమోట్ కైట్లను చూసేందుకు భారీగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేక కల్చరల్ ఈవెంట్స్ కూడా నిర్వహించబోతున్నారు. ఈసారి స్వీట్ స్టాల్స్ భారీగా పెట్టబోతున్నారు. మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో స్వీట్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అలాగే వేర్వేరు రాష్ట్రాల వారు, విదేశీయులు కూడా స్వీట్స్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. దేశీయంగా 700 మంది స్వీట్స్ తయారీదారులు, అలాగే.. ఇరాన్, టర్కీ, ఆఫ్ఘనిస్థాన్ సహా 12 దేశాల వారూ స్వీట్స్ అమ్మబోతున్నారు. దాదాపు 1100 రకాల స్వీట్లు లభించబోతున్నాయి. మొత్తం మీద మూడు రోజుల పాటు కైట్ ఆండ్ స్వీట్ ఫెస్టివల్ పండుగలా సాగనుంది. ఈ ఫెస్టివల్ పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు మధ్యాహ్నం 1 గంటలకు బేగంపేట్ లోని టూరిజం ప్లాజాలో ఏర్పాట్ల వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారు.






