TG: టెట్ పరీక్షలకు రంగం సిద్ధం

by Gantepaka Srikanth |

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ టెట్ 2025 ఆన్ లైన్ పరీక్షలు బుధవారం నుంచి ఈనెల 30 వరకు జరగనున్నాయి.

TG: టెట్ పరీక్షలకు రంగం సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ టెట్ 2025 ఆన్ లైన్ పరీక్షలు బుధవారం నుంచి ఈనెల 30 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు 9 రోజుల పాటు 16 సెషన్లలో నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీజీ టెట్ కన్వీనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్ జిల్లాలలో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు పరీక్షలు రెండు సెషన్‌లలో 9 రోజుల పాటు మొత్తం 16 సెషన్లలో నిర్వహించనున్నారు. ఫస్ట్ సెషన్ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా టెట్ పరీక్షకు సంబంధించి 1,83,653 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్ 1 పరీక్షకు 63,261 మంది, పేపర్ 2 పరీక్షకు 1,20,392 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఏవైనా సందేహాలకు 7093708883, 7093708884, 7093958881,7093468882 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Next Story