- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: మంత్రి ఆదేశాలతో జీవో జారీ.. ఆ ఉద్యోగులు ఫుల్ హ్యాపీ
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదేశాలతో SERPలో వందశాతం బదిలీలకు అనుమతులు ఇస్తూ సోమవారం అధికారులు జీవో జారీ చేశారు. SERPలో మొత్తం 3974 మంది ఉద్యోగులు ఉన్నారు. గత పది సంవత్సరాలుగా బదిలీలు లేవని.. దయచేసి తమను చేయాలని ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. చాలా మంది సిబ్బంది ఒకేచోట పాతుకుపోవడంతో పనుల్లో వేగం తగ్గిందని.. మళ్లీ పనుల్లో వేగం పెంచేందుకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క చెప్పారు.
మహిళా సంఘాలను స్వయం ఉపాధి నుంచి ఉపాధి కల్పన, సంపద సృష్టి దిశలో ప్రభుత్వం(Congress Govt) తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ వేగవంతం కోసం బదిలీలు ఉపయోగపడతాయని భావిస్తున్న ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా, SERP కేంద్ర కార్యాలయంలో ఎంతో మంది ప్రాజెక్టు మేనేజర్లు, జిల్లాల్లో డీపీఎం, ఏపీఎంలు, సీసీలుగా చాలా మంది ఒకే దగ్గర పాతుకుపోయారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.






