- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. నేడు ఆయనతో CM రేవంత్ ప్రత్యేక భేటీ
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(Telangana Cabinet Expansion)కు రంగం సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(Telangana Cabinet Expansion)కు రంగం సిద్ధమైంది. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గవర్నర్‌ను కలవనున్నారు. మ.12 గంటలకు రాజ్‌భవన్ వెళ్లి స్వయంగా కలవనున్నారు. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కేబినెట్‌లో నలుగురికి చోటు కల్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మరోవైపు.. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ(Cabinet Expansion) ఉంటుందని జోరుగా ప్రచారం జరుగడంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడ, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాశారు. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లకు తమ వినతులను మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. రాష్ట్రంలో మాదిగ జనాభా దాదాపు 48 లక్షల మంది ఉన్నారు. కానీ, ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎస్టీ జనాభాలో లంబాడాలు అధిక శాతం ఉన్నారంటూ లంబాడాలు కూడా విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుత మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, నిజామాబాద్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి సైతం తమకు అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






