బిగ్ న్యూస్: మంత్రిని కలవాలంటే పైసల్ కట్టాల్సిందే.. సెటిల్‌మెంట్లకు అడ్డాగా మినిస్టర్ల ఆఫీసులు!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: మంత్రిని కలవాలంటే పైసల్ కట్టాల్సిందే.. సెటిల్‌మెంట్లకు అడ్డాగా మినిస్టర్ల ఆఫీసులు!
X

రాష్ట్ర మంత్రుల వద్ద పని చేసే సిబ్బంది వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. పేషీనే తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. వారి పర్మిషన్ ఉంటేనే మినిస్టర్ల అపాయింట్‌మెంట్ దొరుకుతుంది. మంత్రిని కలవాలంటే రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అడిగినంత ఇస్తే మంత్రి దినచర్య మొత్తాన్ని మినిట్ టు మినిట్ వారికి చెబుతున్నారనే టాక్ ఉన్నది. మినిస్టర్‌ను కలిసిన వెంటనే ఆ విజిటర్‌కు ఫోన్ చేసి డబ్బులు ఎక్కడ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? అని మెసేజ్ పంపుతున్నట్టు తెలుస్తున్నది. ఒక వేళ అడిగినంత ఇవ్వక పోతే మంత్రి బిజీగా ఉన్నారని, ఇప్పట్లో కలవడం సాధ్యం కాదని సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. పీఏలు కాదు.. ఆ జాబితాలో పీఎస్‌లు, ఓఎస్డీలు, పీఆర్‌వోలు ఉన్నట్టు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ మధ్య వివాదాల్లో చిక్కుకున్న ఓ మంత్రి పీఏ పేరు చెబితే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలే భయపడుతున్నారు. ఆ కీలక మంత్రి షెడ్యూల్ కనుక్కునేందుకు ఆయన పీఏకు ఫోన్ చేస్తే చిరాకుగా సమాధానం ఇస్తున్నారనే టాక్ ఉన్నది. కొన్ని సార్లు మిగతా మంత్రుల ఫోన్ కాల్స్‌నూ ఆయన రిసీవ్ చేసుకోరని విమర్శలున్నాయి. ఈ విషయాన్ని సదరు మంత్రికి చెబితే ఎక్కడ, ఏం ఇబ్బంది వస్తుందోనని మౌనంగా భరిస్తున్నట్టు ప్రచారం సాగుతున్నది. కొన్ని సార్లు మంత్రులను ఉద్దేశించి సదరు పీఏ ఏకవచనంతో సంబోధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు ఆ పీఏ తీరును జీర్ణించుకోలేక సీరియస్‌గా క్లాస్ తీసుకుంటే వారి నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకోవట్లేదని చర్చ జరుగుతున్నది.

అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేస్తే లక్షపైనే

కొందరు పీఏ, పీఎస్, ఓఎస్డీలు మంత్రుల అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. డబ్బులు ఇచ్చిన వారికే మంత్రి దినచర్యను మినిట్ టు మినిట్ చేరవేస్తారనే ప్రచారం ఉన్నది. వ్యాపారవేత్తలు, బడా కంపెనీల ప్రతినిధుల వద్ద కూడా మంత్రుల పెషీ స్టాఫ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు విమర్శలున్నాయి. మంత్రిని కలిసిన వెంటనే ఆ విజిటర్‌కు ఫోన్ చేసి డబ్బులు ఎక్కడ ఇవ్వాలి..? ఎవరికి ఇవ్వాలి? అనేది మెసేజ్ చేస్తున్నట్టు సమాచారం. అడిగినంత ఇవ్వకపోతే మంత్రి బిజీగా ఉన్నారని, ఇప్పట్లో కలవడం సాధ్యం కాదని సమాధానం చెబుతున్నట్టు ప్రచారంలో ఉన్నది. ఓ మంత్రి పీఏ ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేసిన దుస్తులు మాత్రమే వాడుతున్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ ఉన్నది.

సెటిల్‌మెంట్లకు కేరాఫ్

కొందరు మంత్రుల వద్ద పని చేసే పీఏ, పీఎస్, ఓఎస్డీలు సెటిల్‌మెంట్లు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని ఓ మంత్రి వద్ద పని చేసే పీఏ ఆ నియోజకవర్గంలో సెటిల్‌మెంట్లు చేస్తారని ప్రచారం సాగుతున్నది. ఇందు కోసం ఆ పీఏ మంత్రికి చెందిన చాంబర్‌నే అడ్డాగా మార్చుకున్నట్టు చర్చ జరుగుతున్నది. దీని వెనుక సదరు మంత్రి ప్రోత్సాహం కూడా ఉన్నదని, అందుకే ఆ పీఏ ధైర్యంగా దందాలు చేస్తున్నట్టు పార్టీ లీడర్లే మాట్లాడుకుంటున్నారు. ఓ మంత్రి వద్ద పనిచేసే ఓఎస్డీ ఆ శాఖకు చెందిన పెండింగ్ బిల్లులను సాంక్షన్ చేయించేందుకు కమీషన్లు తీసుకుంటారని ప్రచారం ఉన్నది.

ఆ మంత్రి పెషీ కూడా అంతేనా..?

కేబినెట్‌లోని ఓ మంత్రిని కలవడం పెద్దగా ఇబ్బంది ఉండదనేది ప్రచారం. ఉదయాన్నే ఆయన ఇంటివద్ద ప్రజలు బారులు తీరుతారు. ఆ మంత్రి ప్రతి ఒక్కర్నీ కలిసి వారి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. వారి సమస్యలు కూడా ఉంటారు. కానీ ఈ మధ్య సదరు మంత్రి పెషీల్లోని సిబ్బంది తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆ మంత్రి వద్ద పని చేస్తున్న స్టాఫ్ వ్యవహార తీరు ఈ మధ్యే చేంజ్ అయినట్టు చర్చ జరుగుతున్నది. కొన్ని సార్లు చికాకుగా ఆన్సర్ ఇవ్వడం, మరికొన్ని సార్లు వెటకారంగా సమాధానం చెబుతున్నట్టు చర్చ జరుగుతున్నది.

అంతా మంత్రుల సపోర్టుతోనే

మంత్రుల సపోర్టుతోనే పీఏ, పీఎస్, ఓఎస్డీ, పీఆర్వోలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా ఆఫీసు నిర్వహణ కోసం, మంత్రులు జిల్లా టూర్లకు వెళ్లినప్పుడు అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా ఫస్ట్ వీక్‌లో పెట్టిన టార్గెట్ మేరకు డబ్బులు వసూలు చేసే బాధ్యత మినిస్టర్ పేషీల్లోని స్టాఫ్ చూసుకుంటున్నట్టు సమాచారం.

ఏయే మినిస్టర్ పేషీ స్టాఫ్ ఎంత వసూలు చేస్తున్నారు? ఎవరి వద్ద నుంచి తీసుకుంటున్నారు? అనే పూర్తి డేటా నిఘా వర్గాల వద్ద ఉన్నట్టు తెలిసింది. ఈ మధ్య ఉత్తర తెలంగాణలోని ఓ మంత్రి పీఏ ఆ జిల్లాకు చెందిన ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్టు తెలిసింది. ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాలని, ఏ చెక్ పోస్టు నుంచి ఎంత ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తారనే చర్చ ఆ శాఖలో ఉన్నది. ఈ విషయాలన్నీ సదరు మంత్రికి తెలిసే జరుగుతాయని ఆ జిల్లా లీడర్లు చెబుతున్నారు.

ఫస్ట్ టర్మ్‌లో సైతం ఆరోపణలు

ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్‌లో పలువురు మంత్రుల పీఏ, పీఎస్, పీఆర్‌వోలపై విమర్శలు వచ్చాయి. సీఎం పీఏగా అజిత్ రెడ్డిని ఉన్న పళంగా పక్కన పెట్టేశారు. ఎందుకు ఆయన్ను పక్కన పెట్టారో ఎవరికీ తెలియదు. గతంలో సీఎం పీఆర్‌వోగా పని చేసిన గటిక విజయ్ కుమార్ సడెన్‌గా రిజైన్ చేశారు. ఆయన రాజీనామా వెనుక ఏం కారణం ఉన్నదో ఇప్పటికీ తెలియని విషయం. ప్రస్తుత హోంమంత్రి మహమూద్ అలీ ఫస్ట్ టర్మ్‌లో రెవెన్యూ శాఖ బాధ్యతలు చూశారు. అప్పట్లో మియాపూర్ భూ కుంభకోణంలో ఆయన పీఎస్ పాత్ర ఉన్నదనే ఆరోపణలు వచ్చాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేషీలో పని చేస్తున్న హరీశ్, అశోక్‌ను క్యాసినో కేసులో ఈడీ విచారించింది.

పీఆర్‌వోల చుట్టూ విమర్శలు

సీఎం చీఫ్ పీఆర్‌వోపై పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. ఆయన ఎక్కడి నుంచి డ్యూటీ చేస్తారు? ఏం సమాచారం ఇస్తారు? అనేది సీఎంవో వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. సీఎంవోలోని మిగతా పీఆర్‌వోలు కూడా సరిగా పని చేయడం లేదనే అభిప్రాయం ప్రగతిభవన్‌లో ఉన్నది.

Also Read: ఢిల్లీ బహుత్ దూర్ హై!



Next Story

Most Viewed