- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించనున్న స్పీకర్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు (ఎమ్మెల్యేల) అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు (ఎమ్మెల్యేల) అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించగా.. స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ నేతల పిటిషన్ల పలు దఫాలుగా విచారించిన స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు స్పీకర్ కార్యాలయంలో ఈ కీలక తీర్పు వెలువడనుంది. బీఆర్‌ఎస్ (BRS) పార్టీ తరఫు అడ్వకేట్‌లు, అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్‌లు తీర్పు ప్రకటన కోసం స్పీకర్ కార్యాలయానికి హాజరుకానున్నారు.
తీర్పు వెలువడనున్న ఎమ్మెల్యేల జాబితా
అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్న ఎమ్మెల్యేల జాబితాలో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి ఉన్నారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తీర్పు తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల బలంపై, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. మరో ఐదుగురు ఎమ్మెల్యేల విచారణ జరుగుతుండటం, వీరిలో ఎమ్మెల్యే కడియం, దానం నాగేందర్‌లు వివరణకు సమయం కోరడంతో వారిపై చర్యలకు సమయం పట్టనుంది.






