- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమస్యను మనదిగా భావించినప్పుడే పరిష్కారం.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
సమస్యను మనదిగా భావించినప్పుడే పరిష్కారం సులభమవుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganth) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సమస్యను మనదిగా భావించినప్పుడే పరిష్కారం సులభమవుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganth) అన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) (Marri Chenna Reddy Human Resource Development Institute) (MCRHRD) లో పౌర కేంద్రీకృత పాలనలో ప్రజావాణి, ప్రజాపాలన పాత్ర అనే అంశంపై ఒక్కరోజు చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా హైడ్రా ప్రజావాణి (Hydra Prajavani) నిర్వహిస్తున్న తీరును, పరిష్కారం చేసిన అంశాలను, ప్రజలకు కలిగే మేలును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Prasentaton) ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అనేక సమస్యలతో మన వద్దకు వస్తుంటారని, వాటిని పరిష్కరించడం మన బాధ్యతగా ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees), మరీ ముఖ్యంగా అధికారులు (Officers) భావించాలని అన్నారు. అలాగే ప్రజల సమస్యలన్నీ దాదాపు సంప్రదింపులతో.. సరైన సూచనలతో పరిష్కారం అవుతాయని, కేవలం 20 శాతం మాత్రమే జఠిలంగా ఉంటాయని తెలిపారు. అందుకే ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పెద్దపీట వేశారని, ఈ క్రమంలోనే ప్రజాపాలన, ప్రజావాణికి ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు.
స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ డా. చిన్నారెడ్డి (Chinna Reddy), ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ (Divya Devarajan) ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వెళ్తున్నారని, వారికి అభినందనలు తెలియజేశారు. అంతేగాక పరిపాలన విధానం ఎలా ఉంది.. సమస్యలపై కింది స్థాయి అధికారుల స్పందన.. ఇలా ప్రజల పల్స్ తెలుసుకోడానికి ప్రజావాణి ఎంతో ఉపయోగపడుతుందని, అందుకే ప్రజావాణిని హైడ్రా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని అన్నారు. ప్రతి సోమవారం ఓ ముఖ్యమైన కార్యక్రమంగా భావించి ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.






