తెలంగాణలో అతిచిన్న గ్రామ పంచాయతీ ఇదే

by Gantepaka Srikanth |

తెలంగాణలో అతిచిన్న గ్రామ పంచాయతీ ఇదే

తెలంగాణలో అతిచిన్న గ్రామ పంచాయతీ ఇదే
X

దిశ, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని అతిచిన్న గ్రామపంచాయతీ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉంది. త్రిపురారం మండలంలో బృందావనపురం గ్రామం అతిచిన్న పంచాయతీ. 1978-1980 మద్యలో గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామంలో నాలుగు గ్రామపంచాయతీ వార్డులు 98 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో రెండు మహిళ, రెండు జనరల్‌గా రిజర్వ్ చేయబడ్డాయి. సర్పంచ్ కూడా జనరల్ చేయబడింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మందడి రమణారెడ్డి (కాంగ్రెస్), శ్రీనువాస్ రెడ్డి (కాంగ్రెస్) ఒకే పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు. నాలుగు వార్డులలో ఇద్దరి చొప్పున 8 మంది పోటీ పడుతున్నారు. ఒకటో వార్డుకు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ రెడ్డి, వంగాల విజయలక్ష్మి, రెండో వార్డుకు మందడి పారిజాత, శ్రీనివాస్ రెడ్డి, మూడో వార్డు కు. కుందూరు రిషిత, వంగాలి రాణి, నాలుగో వార్డు కు కుందూరు శ్రీనివాస్ రెడ్డి, మందడి అంజమ్మలు పోటీ చేస్తున్నారు. ఈ గ్రామంలో డిసెంబర్ 14 న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Next Story