- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad: హైదరాబాద్‌లో భగ్గుమంటున్న ఎండలు.. కాలి బూడిదైన బైక్!
మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. హైదరాబాద్‌లో ఎండలు భగ్గుమంటున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. హైదరాబాద్‌లో ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూకట్ పల్లి పరిధిలోని జగద్గిరిగుట్టలో సోమవారం ఓ పల్సర్ బైక్ (Burned) కాలి బూడిదైంది. రోడ్డుపై ఓ వ్యక్తి పల్సర్ బైక్‌పై వెళ్తున్న క్రమంలో బైక్ హీటెక్కడంతో ఇంజన్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో రైడర్ బైక్‌ను రోడ్డు పక్కన ఆపి స్థానికుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
కానీ అప్పటికే బైక్ పూర్తిగా కాలి పోయింది. అయితే రోడ్డు పక్కనే బైక్ కాలుతుండటంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓల్డ్ మోడల్ వెయికిల్స్‌కు సరైన నిర్వహణ లేకపోడం వల్ల త్వరగా హీటెక్కి మంటలు వ్యాప్తి చెందుతాయని ఓ వ్యక్తి కామెంట్ పెట్టారు. ఎండ తీవ్రతకు బైక్ కాలిపోవడం ఏమిటని? పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.






