రిగ్గింగ్ చేసేందుకు అధికార పార్టీ బరితెగిస్తోంది.. MLC రవీందర్‌రావు సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లో జరిగేవి ఉపఎన్నికలు కావని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కుట్రలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao) ఫైర్ అయ్యారు.

రిగ్గింగ్ చేసేందుకు అధికార పార్టీ బరితెగిస్తోంది.. MLC రవీందర్‌రావు సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లో జరిగేవి ఉపఎన్నికలు కావని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కుట్రలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao) ఫైర్ అయ్యారు. తాజాగా ఇవాళ తన ఇంట్లో పోలీసులు చేపట్టిన సోదాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో పోలీసులు ఇలా బెదిరించడం దుర్మార్గమని అన్నారు. ఇవి ఎన్నికలు కావని.. రేవంత్ చేస్తున్న కుట్రలని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బై పోల్‌లో రిగ్గింగ్ చేసుకోవడానికి అధికార పార్టీ బహిరంగంగా బరితెగిస్తోందని కామెంట్ చేశారు. ఈ దౌర్జన్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని.. తక్షణం సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఇంట్లో డబ్బు పెట్టి కేసులు పెట్టాలన్నది పోలీసుల ప్రధాన ఉద్దేశమని.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లలోకి సోదాలకు వచ్చారని రవీందర్ రావు ధ్వజమెత్తారు.

Next Story