- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతిఒక్కరి జీవితంలో వైద్యుల పాత్ర కీలకం.. డాక్టర్స్ డే వేళ మంత్రి దామోదర స్టేట్‌మెంట్
మనిషి పుట్టుక నుంచి చివరి క్షణం వరకు ప్రతి ఒక్కరి జీవితంలో వైద్యలు పాత్ర అత్యంత కీలకమైనదని, వారి సేవలు అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మనిషి పుట్టుక నుంచి చివరి క్షణం వరకు ప్రతి ఒక్కరి జీవితంలో వైద్యలు పాత్ర అత్యంత కీలకమైనదని, వారి సేవలు అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) అన్నారు. ఇవాళ డాక్టర్స్ డే (Doctors Day) సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వారి కృషి అమోఘమని కొనియాడారు. కరోనా (Corona) క్లిష్ట సమయంలో కూడా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తూ, ప్రజల ప్రాణాలను కాపాడిన డాక్టర్లు నిజమైన యోధులని ప్రశంసించారు. భవిష్యత్తులో వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని హామీ ఇచ్చారు.
వరుస నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గతేడాది సుమారు 430 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ (Civil Assistant Surgeon) పోస్టులు, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డెంటిస్టుల ఆకాంక్షను నెరవేరుస్తూ 48 డెంటల్ సర్జన్ (Dental Surgeon) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. గడిచిన 18 నెలల కాలంలో సుమారు వెయ్యి మంది డాక్టర్లకు ప్రమోషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బందికి ఆహ్లాదకరమైన వర్క్ ఎన్విరాన్‌మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు వైద్యులు కృషి చేయాలని మంత్రి దామోదర పిలుపునిచ్చారు.






