- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ వెనుక అసలు రహస్యం! బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్
by Ramesh Naini |
ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగి పదేళ్ల పూర్తయిన సందర్భంగా సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించనున్నట్లు చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అయితే వీరి భేటీపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టులు చేసింది. తెలంగాణ పరిశ్రమలపై ఏపీ నజర్ పెట్టిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ‘ఇదన్నమాట వీళ్ళ భేటీ వెనుక అసలు రహస్యం! తెలంగాణ పరిశ్రమలపై ఏపీ నజర్.. వాటిని అప్పజెప్పేందుకు గురు శిష్యుల భేటీ. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారనున్న రేవంత్ గురుదక్షిణ’ అంటూ ఆరోపించింది.
Next Story






