- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Swarnagiri Sri: స్వర్ణగిరి శ్రీ వారిని తాకిన సూర్యకిరణాలు !
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్‌లో నిర్మింపబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్‌లో నిర్మింపబడిన స్వర్ణగిరిSwarnagiri Sri శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ప్రత్యక్ష స్వరూపమైన సూర్యభగవానుని కిరణాలు(Rays Of The Sun That Touched) ఉదయాన్నే గర్భగుడిలోని స్వామివారి పాదాలపై పడడం ఎంతో విశిష్టతను కలగజేసింది. దీన్ని భగవత్ కృపగా ఆలయ అర్చకులు అభివర్ణించారు. గత సంవత్సరం ఇదే రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడాన్ని గమనించామని..తిరిగి ఈ రోజు కూడా ఉదయం మంచు తెరలను చీల్చుకుని సూర్య భగవానుని కిరణాలు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై పడడం జరిగిందని వారు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి 55కిలోమీటర్ల దూరంలో కొండలపై నిర్మితమైన స్వర్ణగిరి దేవాలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో అధ్భుతంగా నిర్మించారు. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్న స్వర్ణగిరి ఆలయం యాదగిరి గుట్టకు వెళ్లే మార్గంలోనే ఉండటంతో అక్కడికి వెళ్లివచ్చే భక్తులు స్వర్ణగిరిని కూడా దర్శించుకుంటున్నారు. వంద రోజుల కాల వ్యవధిలో సగటున 50లక్షల మంది దర్శించుకుంటున్నట్లుగా నిర్వహకులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక పర్వదినాల్లో, సెలవు రోజుల్లో స్వర్ణగిరి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.






