- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో నాణ్యతను పెంచాలి : మంత్రి ఉత్తమ్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యతను పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ,తెలంగాణ బ్యూరో: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యతను పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ జిల్లాల డీఎంలు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ... క్షేత్రస్థాయిలో రాష్ట్రంలోని పేదలకు అందిస్తున్న బియ్యాన్ని ఎవరు తినటం లేదనే విషయాన్ని అధికారులకు తెలిపారు. కేంద్రం నుంచి కిలో రూ.39 చొప్పున వెచ్చించి పేదలకు బియ్యం అందిస్తున్న తరుణంలో వాటిని వినియోగించుకోలేక వివిధ రీతుల్లో వాటిని రీసైక్లింగ్ చేస్తున్న విషయాన్ని ఆయన అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి పేదలకు ఇచ్చే బియ్యంలో నాణ్యతను పెంచి వారు వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని కమిషనర్ అనిల్ కుమార్ ను ఆయన ఆదేశించారు.
పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినే విధంగా ఉండాలి తప్ప వేరే విధంగా దుర్వినియోగం కావొద్దని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ అంటేనే పేదవాడికి ఆహారాన్ని అందించే ఒక బృహత్తకరమైన శాఖ అని కాబట్టి విశాఖలో పారదర్శకంగా, అవినీతిరహిత, నాణ్యమైన సేవలు అందించాలని ఆయన అధికారులను ఉద్యోగులను కోరారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో మనం మరింత పారదర్శకంగా, అవినీతిరహిత నాణ్యమైన సేవలను అందించాలని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. కానీ అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందని అభిప్రాయ పడ్డారు.మొక్కుబడిగా కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని ..బియ్యం పేదలకు ఎలా ఉపయోగకరమైన పథకం గా ఉంటుందో మనం అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రములో బియ్యం లబ్దిదారుల నుంచి రాండం చెక్ చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను మంత్రి అడిగారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ ద్వారా 56 వేల కోట్ల రూపాయలలో ద్వారా అప్పు తెచ్చిందని వాటికి వేట అప్పు పెరిగిపోతుందని వాటిని అధిగమించటానికి మిల్లర్ల వద్ద ఉన్న 18 వేల కోట్ల రూపాయలను రాబట్టగలిగితే ఈ అప్పుల భారం నుంచి అధిగమించవచ్చని దీనిపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు.రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్ లో ఉన్న 87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని త్వరగా తెప్పించే ప్రయత్నం చేయాలన్నారు.






