- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Raja Narsimha : ప్రతి పేదవాడికి ప్రజా ప్రభుత్వం అండ : మంత్రి రాజనర్సింహ
ప్రతి పేదవాడి(Eevery Poor Person)కి ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం(Congrss Government)అండగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodar Raja Narasimha)స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రతి పేదవాడి(Eevery Poor Person)కి ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం(Congrss Government)అండగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodar Raja Narasimha)స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా నేరడిగుంట గ్రామసభలో మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై మాట్లాడారు. అర్హత ఉన్న వారికి ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహాయం తప్పక అందుతుందన్నారు. రైతురుణమాఫీ త్వరలో పూర్తవుతుందన్నారు.
జనవరి 26నుంచి రైతు భరోసా పంపిణీ జరుగనుందన్నారు. వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పించన్ ఇంకా రావాల్సిన వారికి ప్రభుత్వం అందిస్తుందని, ఆందోళన అక్కరలేదన్నారు. ఇచ్చిన అన్ని హామీలు త్వరలో నెరవేరుస్తామన్నారు. రాబోయే 10 రోజుల్లో నేరేడుగుంట నుంచి ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆర్డీవో సర్వే చేయించి, సర్వే చేసిన భూమిని నిరుపేదలకు ఇళ్లకు కేటాయిస్తారని రాజనరసింహ వెల్లడించారు.
1994లో మహిళల అభివృద్ధి కోసం ఐదెకరాల భూమిని కేటాయించామమని, మహిళల కోసం కోళ్ల ఫోరం పెట్టడం ద్వారాల్ల అభివృద్ధి చెందే ఆలోచన చేశామని, ఇప్పుడు ఆ ఐదు ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇళ్ల ఏర్పాటుకు కేటాయిస్తున్నామన్నారు. నేరేడు గుంటలో పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ముందు ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆందోల్ నియోజకవర్గంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.






