- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదోన్నతులపై కొర్రీలు.. మంత్రి ఆదేశాలు బుట్టదాఖలు
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆఫీసులో కొంతమంది ఇష్టారాజ్యం కొనసాగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆఫీసులో కొంతమంది ఇష్టారాజ్యం కొనసాగుతున్నది. ఏళ్ల తరబడి తిష్టవేసిన కొందరు సిబ్బంది ఫైల్‌ను త్వరగా కదలించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల పదోన్నతుల ఫైల్ విషయంలో వీరి వ్యవహారశైలిపై చర్చనీయాంశంగా మారింది. నర్సింగ్ విద్యకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే రాష్ట్రంలో కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఫ్యాకల్టీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించి స్టాఫ్ నర్సులుగా పనిచేస్తూ.. ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వారికి వెంటనే పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. అయితే డీఎంఈలోని కొందరు అధికారులు, సిబ్బంది తీరుతో పదోన్నతుల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. చివరికి వైద్యారోగ్య శాఖ మంత్రి కార్యాలయం, డీఎంఈ సైతం ఫైల్ రెడీ చేయాలని ఆదేశాలు జారీచేయగా.. కొత్త కొత్త కొర్రీలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కదలని సీనియారిటీ లిస్టు
మొదట సీనియారిటీ లిస్టు తయారీని తా త్సారం చేస్తూ హైదరాబాద్ కోఠిలోని కా ర్యాలయ సెక్షన్ అధికారులు, సిబ్బంది లం చాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఒక్కో నర్సింగ్ ఆఫీసర్ వద్ద రూ.10వేల చొప్పున లంచం వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. అందుకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు జమ చేసి తీసుకుపోయి సదరు సెక్షన్‌లో కీలకపాత్ర వహించే ఓ కిందిస్థాయి అధికారికి అందజేశారు. ఫలితంగానే ఆలస్యంగానైనా సీనియారిటీ లిస్ట్ తయారైంది. కొందరు రూ.రెండు లక్షల చొప్పున లంచం ఇచ్చి ప్రమోషన్ల ఫైల్‌ను ఆపివేయించారనే ఆరోపణలు వచ్చాయి. విషయమై అప్పట్లో డీఎంఈ కార్యాలయానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. గతేడాది ప్రమోషన్ల ఫైల్‌ను టేబుల్‌కే పరిమితం చేశారు. డీహెచ్ ఆఫీసు నుంచి ఎమ్మెస్సీ చేసిన వారి వివరాల కోసం సంప్రదించామని, ఆలస్యం ఎందుకు అవుతున్నదో తెలియదని సాకులు చెబుతూ వస్తు న్నారు. కొందరు ఎమ్మెస్సీ పాస్ అయినప్పటికీ ఆరునెలల గడువు తర్వాతే పదోన్నతు లు ఇవ్వాలనే నిబంధన ఉండటంతోనే వారి ని లిస్టులో చేర్చేందుకు ఫైలును ఆపుతున్నారని నర్సింగ్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
నర్సింగ్ కాలేజీల్లో స్టాఫ్ కొరత
రాష్ట్రంలో రెండేళ్ల క్రితం కొత్తగా ప్రారంభించిన నర్సింగ్ కాలేజీలతో పాటు అప్పటికే ఉన్న కాలేజీల్లో మొత్తం 560 ఫ్యాకల్టీ (లెక్చరర్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 93 మంది లెక్చరర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్ రావడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో 653 ఖాళీలు ఏర్పడ్డాయి. సరైన ఫ్యాకల్టీ లేక.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఎంఎస్సీ పాసైన 84 మందిని డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. అయినా కొరత తీరలేదు. ఒక్కో కాలేజీలో కనీసం ఇద్దరు ఫ్యాకల్టీ లేకపోవడంతో తాము విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పదోన్నతులు
వివిధ సాంకేతిక కారణాల వల్ల నర్సింగ్ ఆఫీసర్ల పదోన్నతుల ప్రక్రియ ఆలస్యమైంది. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పదోన్నతుల ప్రక్రియ చేపడతాం. - డీఎంఈ ఎ.నరేంద్ర కుమార్






