సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్డు ధరలు

by Prasad Jukanti |

రాష్ట్రంలో మరోసారి కోడిగుడ్ల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.

సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్డు ధరలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలన్ని సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఏం కొనెట్టు లేదు ఏం తినేట్టు లేదు అనేలా పేదల పరిస్థితి తయారవుతున్న తరుణంలో కోడి గుడ్డు ధరలు సైతం ఆకాశానంటుతున్నాయి. గత వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్న కోడిగుడ్డు ధర తాజాగా భారీగా పెరిగింది. గత పదిరోజుల్లోనే ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 3 మేర పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా చేస్తోంది. రెండు వారాల క్రితం ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 4 ఉండగా ఇప్పుడు రిటైల్ మార్కెట్‍లో ఒక్కోగుడ్డు ధర రూ.7 కు చేరింది. ఇక హోల్ సేల్ దుకాణాల్లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.6.30 గా పలుకుతోంది.

తగ్గినట్టే తగ్గి మళ్లీ పైపైకి:

నిజానికి అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా కారణంగా ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావంతో మార్చిలో గుడ్ల ధరలు తగ్గాయి. అయితే ఈ తగ్గింపు స్వల్పకాలికంగానే ఉంది. తాజాగా ఉష్ణోగ్రతల పెరిగి కోళ్లు మరణిస్తున్నాయని దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిందని తద్వారా కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయని పౌల్టీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక గుడ్ల పరిస్థితి ఇలా ఉంటే చికెన్ పరిస్థితి మరోలా ఉంది. గత నెలలో కిలో ఏకంగా రూ. 400 వరకు చేరి రికార్డు సృష్టించిన చికెన్ ధరలు ప్రస్తుతం అమాంతం దిగి వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో చికెన్ లైవ్ బర్డ్ (ఫామ్ రేట్): రూ. 110, లైవ్ బర్డ్ (రిటైల్ రేట్): రూ. 137, డ్రెస్సెడ్ చికెన్: రూ. 199, స్కిన్‌లెస్: రూ. 226 వరకు ఉంది.

Next Story